ఆ సినిమాలో ఛాన్స్‌ కోసం బికినీ ఫోటోలు పంపితే డైరెక్టర్‌ ఏం చేశాడంటే: కస్తూరి

14 Nov, 2023 08:59 IST|Sakshi

అన్నమయ్య,పెద్దరికం, భారతీయుడు సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీనియర్‌ హీరోయిన్‌ కస్తూరి.. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసిన కస్తూరికి భారీ ఫ్యాన్స్‌ బేస్‌ ఉంది. ఇండస్ట్రీలో తనకు నచ్చిన విషయంతో పాటు ఏదైనా నచ్చలేదంటే ఓపెన్‌గానే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే గట్స్‌ ఆమెకు ఉన్నాయి. అలా ఒక్కోసారి ఆమె కామెంట్లు భారీగానే వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె  'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌లో తులసి పాత్రతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

తాజాగా ఇంటర్వ్యూలో కస్తూరి తన కెరీర్‌ ప్రారంభం రోజుల్ని  గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.   శంకర్ లాంటి దర్శకుడితో కలసి పనిచేయడం ఎంత అదృష్టమో నాకు ఆ తర్వాత రోజుల్లో తెలిసింది. 'అప్పుడు నాది చిన్న వయసు. కాబట్టి ఏదో సరదాగా చేసేశాను. కమల్‌ హాసన్‌ హిట్‌ సినిమా భారతీయుడులో మొదట హీరోయిన్‌ ఛాన్స్‌ నాకే వచ్చింది. ఆ సినిమా విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని  డైరెక్టర్‌కి బికినీ ఫోటోలు కూడా పంపించాను.

కానీ.. అదే సమయంలో రంగీలా చిత్రం రిలీజ్‌ కానుంది. ఆ సమయంలో ఎక్కడ చూసిన ఊర్మిళ గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భారతీయుడు సినిమా మేకర్స్‌ అటెన్షన్ ఆమె వైపు వెళ్ళింది. చివరికి ఊర్మిళను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. నాకు మాత్రం కమల్ హాసన్ చెల్లి పాత్ర ఇచ్చి సరిపెట్టేశారు. అలా భారతీయుడికి కుమార్తెగా నటించాను. కొద్దిరోజుల తర్వాత ఏంటి సర్ ఇలా చేశారు..? అని అడిగితే.. సినిమాలో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పడంతో నేను కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాను.' అని కస్తూరి తెలిపింది.

మరిన్ని వార్తలు