సెల్ఫీతో సందడి

6 Jan, 2018 00:19 IST|Sakshi

ఫ్రమ్‌ ఏ టూ సి... ఏ సెంటరైనా రవితేజకు ఫ్యాన్స్‌ ఉన్నారు. జస్ట్‌ రెండే సినిమాల (సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం)తో యూత్, ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యారు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. మాస్‌ హీరో రవితేజతో ఈ యంగ్‌ డైరెక్టర్‌ చేస్తోన్న సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా శర్మ కథానాయిక.

‘‘రెగ్యులర్‌ షూట్‌ను స్టార్ట్‌ చేశాం. సక్సెస్‌లో ఉన్న రవితేజ, కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో మా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ ఇండస్ట్రీలో బజ్‌ స్టార్ట్‌ అయ్యింది. ముకేశ్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేస్తున్నారు’’ అన్నారు రామ్‌ తాళ్లూరి. ఫస్ట్‌ డే  షూటింగ్‌ స్పాట్‌లో యూనిట్‌ మెంబర్స్‌తో రవితేజ సరదాగా సెల్ఫీ దిగి, సందడి చేశారు.

మరిన్ని వార్తలు