దెయ్యంగా రెజీనా!

22 Jun, 2016 02:38 IST|Sakshi
దెయ్యంగా రెజీనా!

ఆశించినవి జరగవు. అయితే జరిగే వాటిని అనుకూలంగా మార్చుకోవడం బుద్ధిమంతుల లక్షణం అంటారు. నటి రెజీనా ఇప్పుడు ఈ మంత్రాన్నే పాఠిస్తున్నారు. కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి రెజీనా. ఆ చిత్రం విజయం సాధించినా ఆ తరువాత ఈ అమ్మడికి ఇక్కడ అంత ఆశాభావ పరిస్థితులు కనిపించలేదు.
 
 కారణం అందాలారబోతకు తాను దూరం అంటూ మడికట్టుకు కూర్చోవడమే. సహ నటీమణులు గ్లామర్‌లో దుమ్మురేపుతుంటే తాను కుటుంబ కథాపాత్రలనే చేస్తానన్న రెజీనాను కోలీవుడ్ దూరంగా పెట్టింది. దీంతో ఈ భామ టాలీవుడ్‌పై దృష్టి సారించారు.అక్కడ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది.
 
  అవకాశాలతో పాటు విజయాలు వరిస్తున్నాయి. అయినా తమిళంలో నెగ్గలేకపోయాననే చింత రెజీనాను ఒక పక్క వెంటాడుతూనే ఉంది. దీంతో తన హద్దులను చెరిపేయడానికి సిద్ధపడి సొంతంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని హాట్ హాట్ ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టి గ్లామర్ పాత్రలకు సై అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.అయితే అలాంటి గ్లామరస్ ఫొటోలు పబ్లిసిటీకి పనికొచ్చాయిగానీ అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేదు.
 
 ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఒక అవకాశాన్ని కోలీవుడ్‌లో రెజీనా రాబట్టుకుంది.అదీ సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడంలో చాలా ఖుషీ అయిపోయారు. ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని కోలీవుడ్‌లో పరిక్షించుకోవచ్చునని భావించారు.సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్లై. ఎస్‌జే.సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నందిత  నాయికలుగా నటిస్తున్నారు.
 
  అయితే ఆ చిత్రంలో అందాలను ఆరబోసి మరిన్ని అవకాశాలను రాబట్టుకోవాలని ఆశ పడిన రెజీనాకు ఆ అవకాశం లేకపోయిందట. కారణం ఇందులో ఆమెను సెల్వరాఘవన్ దెయ్యంగా చూపించడమే. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి దెయ్యం కథా చిత్రం ఇదేనన్నది గమనార్హం. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం ఇంటర్నెట్‌లో విడుదల చేశారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి