ఆమె లోపలి బడబాగ్ని ఎవరికి తెలుసు

2 Apr, 2016 13:55 IST|Sakshi
ఆమె లోపలి బడబాగ్ని ఎవరికి తెలుసు

ముంబై

టీవీ నటి  ప్రత్యూష బెనర్జీ  అకాల మరణం పై  పలువురు బాలీవుడ్  ప్రముఖులు, నటులు, టీవీనటులు దిగ్బ్రాంతి వక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆకాంక్షించారు.  'బాలికా వధు' ద్వారా   సుపరితచితమైన ప్రత్యూష మృతిపై  బాలీవుడ్  దర్శకులు కరణ్ జోహార్, మధుర్ భండార్కర్,  సీనియర్ నటుడు రిషి కపూర్, అనుపమ్ ఖేర్,  అర్బాజ్ ఖాన్, సిమీ గరేవాల్ తదితరులు  ట్విట్ చేశారు. టీవీ నటీనటులు సోఫీ చౌదరి,  కరిష్మా  తన్నా,  మికా సింగ్, గౌర్ ఖాన్  కూడా  ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.  ఈ విషాదాన్ని తట్టుకోలిగే శక్తిని  తల్లిదండ్రులకు  ప్రసాదించాలని వేడుకున్నారు.  ఈ సందర్బంగా గతంలో అనుమానాస్పద  స్థితిలో మరణించిన జియా ఖాన్, నఫీసా ఖాన్ లను గుర్తు చేసుకున్నారు.

ఎంత అవమానం, అంత మంచి అమ్మాయి అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం బాధ  కలిగించిందని  బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్ అన్నారు. ఆమెలో చెలరేగిన బడబాగ్ని ఎవరికి తెలుసంటూ  ప్రత్యూష మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం  చేశారు.  బాలికా వధు  సీరియల్ ఒక్కటే తాను చూస్తానని సిమీ గరేవాల్ అన్నారు. 24 ఏళ్లకే ఆమె తనువుచాలించడం విచాకరమన్నారు. కుటుంబ మద్దతు లేకుండా ఆడపిల్లల మనుగడ చాలా కష్టమవుతుందని ఆమె ట్విట్ చేశారు.  మానసిక ఒత్తిడిపై సీరియస్ గా స్పందించని కుటుంబాలకు ,  స్నేహితులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని కరణ జోహార్ ట్విట్ చేశారు. ఆమె హఠాన్మరణం తనను షాక్ కు గురి చేసిందంటూ  మధుర్ భండార్కర్  ప్రత్యూష మృతికి సంతాపం తెలిపారు.