సకల కళలు

29 Jan, 2019 02:59 IST|Sakshi
తనిష్క్‌ రెడ్డి, మేఘ్లా ముక్తా

తనిష్క్‌ రెడ్డి, మేఘ్లా ముక్తా జంటగా శివగణేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. ‘సుబ్రమణ్యపురం’ నిర్మాత బీరం సుధాకర్‌ రెడ్డి సమర్పణలో సింహా ఫిలింస్, దీపాల ఆర్ట్స్‌ పతాకాలపై అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

హీరో నటన, కథ, కథనాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నేపథ్యసంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘ఒక హిట్‌ చిత్రానికి కావాల్సిన ఎలిమెంట్స్‌ అన్నీ మా సినిమాకి కుదిరాయి. పృథ్వీ, జీవాల కామెడీ సన్నివేశాలు ఓ ఆకర్షణ. పాటలు మాస్‌ ఆడియన్స్‌ని అలరిస్తాయి’’ అన్నారు శివ గణేష్‌. ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌.
∙తనిష్క్‌ రెడ్డి, మేఘ్లా

మరిన్ని వార్తలు