ఇది వరమా లేక శాపమా..? భయమేస్తోంది : కీర్తి సురేశ్‌

9 Nov, 2023 16:11 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలు ప్రభుత్వ పెద్దల వరకు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించారు. ఇప్పటికే ఈ వీడియోపై అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, మా అధ్యక్షుడు మంచు విష్ణు, విజయ్‌ దేవరకొండ లాంటి అగ్ర నటీనటులు స్పందించారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌  కూడా సోషల్‌ మీడియా వేదికగా రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి చెత్త వీడియోలు సృష్టించే బదులు.. ఆ సమయంలో అందరికి ఉపయోగపడే పని చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు.

‘సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. ఇలాంటి చెత్త వీడియోలను క్రియేట్‌ చేసే వ్యక్తి.. ఆ టెక్నాలజీని, విలువైన సమయాన్ని ఏదైన మంచి పనికి ఉపయోగించాల్సింది. ప్రస్తుతం అభివృద్ది చెందిన ఈ టెక్నాలజీ మనకు వరమో లేక శాపమో అర్థం కావట్లేదు. ప్రేమను, మంచి పంచడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిద్దాం.అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు’ అని కీర్తి సురేశ్‌ ట్వీట్‌ చేశారు.  ఇటీవల ‘భోళా శంకర్‌’తో  ప్రేక్షకులను అలరించిన కీర్తి..ప్రస్తుతం ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ తదితర తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 

మరిన్ని వార్తలు