'ఇకపై హిందీ, ఉర్దూలలో ట్వీట్ చేస్తా'

28 May, 2015 16:46 IST|Sakshi
'ఇకపై హిందీ, ఉర్దూలలో ట్వీట్ చేస్తా'

ట్విట్టర్.. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలందరూ విపరీతంగా వాడుతున్న మైక్రో బ్లాగింగ్ సైట్. అందులో తాను త్వరలోనే హిందీ, ఉర్దూ భాషల్లో ట్వీట్ చేయనున్నట్లు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (49) చెప్పాడు. 2010లోనే ట్విట్టర్లో చేరిన సల్మాన్ ఖాన్కు ఇప్పటికి 1.21 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.

అభిమానుల కోసం.. త్వరలోనే తాను హిందీ, ఉర్దూ భాషల్లో కూడా ట్వీట్లు ఇస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారానే సల్లూభాయ్ చెప్పాడు. సల్మాన్ నటించిన 'బజరంగీ భాయీజాన్' సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ పోస్టర్లో సల్మాన్ బాగా రఫ్గా కనిపిస్తాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ సరసన కరీనా కపూర్ ఖాన్ నటించింది.