సమాజంతో సత్య

2 Jul, 2015 08:21 IST|Sakshi
సమాజంతో సత్య

షార్ట్ ఫిల్మ్ రివ్యూ

సమాజం బాగుంటే దేశం బాగుంటుందని, స్వార్థాన్ని మరచి మంచి మనిషిగా జీవించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందనే అంశంతో తెరకెక్కిన ‘సమాజంతో సత్య’ లఘుచిత్రం యువతను ఆలోచింపజేస్తుంది. వెంకట్ పసుపులేటి దర్శకత్వంలో అశోక్‌కుమార్ ప్రధాన పాత్రలో కేకే ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ లఘుచిత్రాన్ని నిర్మించారు.

వందేమాతరం, భారతీయులంతా నా సహోదరులు, జనగణమన పాడుతున్నాం తప్ప సమాజంలో జరిగే తప్పులు, అసాంఘిక శక్తులు, వివిధ సంఘటనలను పట్టించుకోకుండా నేను బాగుంటే చాలు అని జీవించినంతకాలం ఈ సమాజం, దేశం బాగుపడదని వివరిస్తూ చెప్పిన సంభాషణలు ఆలోచింపజేశాయి. ఎందరో ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు వస్తున్నారు గానీ, సమాజం గురించి ఆలోచించే మంచి మనిషి రాలేకపోతున్నాడని, అందరం బాగుంటేనే దేశం బాగుంటుందనే సందేశాన్ని చెప్పారు.                               
- శ్రీనగర్‌కాలనీ