మిస్టరీ వీడిందా?

23 Jul, 2018 00:57 IST|Sakshi
సమంత

‘రంగస్థలం, అభిమన్యుడు, మహానటి’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకొని, నటిగా తన స్థాయిని పెంచుకున్న సమంత ‘యూ టర్న్‌’ చిత్రంతో మరోసారి తన నట విశ్వరూపం చూపనున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో సమంత ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పోలీస్‌ ఆఫీసర్‌గా, రాహుల్‌ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

సమంత ఇన్‌టెన్స్‌ లుక్స్, పెర్ఫార్మెన్స్‌ ‘యూ టర్న్‌‘ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్‌ 13న మా సినిమాని తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘యూ టర్న్‌’ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్‌ బొమ్మి, నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్, వివై కంబైన్స్‌. కాగా, సమంత తమిళంలో నటించిన ‘సీమరాజా’ చిత్రం కూడా సెప్టెంబర్‌ 13నే విడుదల కానుండటం విశేషం.

మరిన్ని వార్తలు