ఆ కథలు నాకు ధైర్యాన్నిచ్చాయి

10 Nov, 2023 03:55 IST|Sakshi

సమంత

‘‘నా జీవితంలో విడాకులు, నా సినిమాలు వరుసగా పరాజయం చెందడం.. ఆరోగ్య సమస్యలు (మయోసైటిస్‌).. ఇలా అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయాను’’ అని సమంత అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. అదే ఇంటర్వ్యూలో సమంత ఇంకా మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎవరికైనా ముఖ్యమైనది వివాహం.

నా వైవాహిక జీవితం విఫలమైంది.. ఆరోగ్యం క్షీణించింది. అదే టైమ్‌లో నా సినిమాలూ ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సమస్యలతో సుమారు రెండేళ్లు జీవితంలో ఎంతో కుంగిపోయాను. అప్పుడు  బుక్స్‌ చదవటం మొదలుపెట్టాను. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, మళ్లీ సినిమాలు చేసిన నటుల గురించి, జీవితంలో ట్రోలింగ్‌కి, మానసిక ఒత్తిడికి గురైన వారు ఎలా కోలుకున్నారో తెలుసుకున్నాను. వారి కథలు చదవడం నాకెంతో ఉపయోగపడింది.

వారిలా నేనూ చేయగలననే ధైర్యం వచ్చింది. ఈ దేశంలో ఎందరో స్టార్స్‌ ఉన్నారు. అందరిలో నాక్కూడా గుర్తింపు రావడం గొప్ప అదృష్టం. నా లైఫ్‌లోని ఒడిదుడుకులు బహిర్గతమైనందుకు నాకు బాధ లేదు. ఇక్కడ నాలా ఇబ్బందులు పడేవారు ఎందరో ఉన్నారు. వారందరూ నాలాగే పోరాడాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.  

మరిన్ని వార్తలు