మరోసారి తల్లి అయిన బాలీవుడ్‌ హీరోయిన్‌

13 Jul, 2019 09:14 IST|Sakshi

మా ఏంజల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమీరా రెడ్డి ఇంట మరోసారి సందడి నెలకొంది. ఆ కుటుంబంలోకి మరో బుజ్జాయి విచ్చేసింది. అశోక్‌, జై చిరంజీవి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సమీరా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీ ప్రేమ‌కి, ఆశీర్వాదాల‌కి ధ‌న్య‌వాదాలు’  అంటూ ... ఆ చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశారు. 2014లో వ్యాపారవేత్త‌ అక్ష‌య్ వార్డేని వివాహం చేసుకున్న సమీరాకు నాలుగేళ్ల కుమారుడు హన్స్‌ ఉన్నాడు. మరోవైపు సమీరాకు అభిమానులు, బాలీవుడ్‌ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పిన సమీరా చివరగా 2013లో కన్నడ చిత్రం ‘వరదనాయక’లో కనిపించారు. కాగా సమీరా రెడ్డి ఫోటో షూట్‌లతో హల్‌చల్ చేశారు. మాతృత్వం స్త్రీకి అపురూపమైనదంటూ.. తొమ్మిదో నెలను ఎప్పటికీ గుర్తుంచుకునేలా... దాని కోసమే ఇలా ఫోటోలు దిగానని, ఇదే నిజమైన సమీరా అంటూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో ఆమె మేకప్‌ లేకుండా సహజంగా కనిపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా