‘చండి’ లో స్కార్లెట్ హంగామా

18 Jul, 2013 06:09 IST|Sakshi
‘చండి’ లో స్కార్లెట్ హంగామా
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘జొరమొచ్చింది.’ అంటూ ఐటమ్‌సాంగ్‌లో నర్తించిన స్కార్లెట్ విల్సన్ గుర్తుంది కదూ? ఆ అందాలభామ ఇప్పుడు ‘చండీ’లో కూడా ఐటమ్ సాంగ్ చేస్తోంది. హైదరాబాద్‌లో వేసిన ఓ పబ్‌సెట్‌లో ప్రస్తుతం ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రియమణి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి సముద్ర దర్శకుడు. 
 
జి. జగన్నాథనాయుడు సమర్పణలో డా.జి. శ్రీనుబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కృష్ణంరాజు, శరత్‌కుమార్‌లు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ- ‘‘దర్శకుడు కథ చెబితే సూపర్‌గా ఉందని చెప్పాను. కానీ నేనున్న బిజీలో ఎక్కువ రోజులు కేటాయించలేనంటే, దర్శకుడు నా కోసం తక్కువ టైమ్‌లో పాత్రను షూట్ చేశారు’’ అని చెప్పారు.
 
 సముద్ర మాట్లాడుతూ- ‘‘పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ పాటతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఈ సినిమాలో మరో అద్భుతం కూడా ఉంది. అదేంటో త్వరలో వెల్లడిస్తా’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఆర్. శంకర్-చిన్నా, కెమెరా: వాసు, కథ-మాటలు: కరణం.పి.బాజ్జీ.