43 ఏళ్ల తరువాత బయటపెట్టిన ‘షోలే’ దర్శకుడు

13 Jan, 2018 13:10 IST|Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు వరుసగా సెన్సార్ బోర్డ్ తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన సీనియర్ దర్శకుడు రమేష్‌ సిప్పి ఇది కొత్త వచ్చిన సమస్య కాదని.. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సెన్సార్ సమస్యలు ఉన్నాయిని వెల్లడించారు. ఈసందర్భంగా షోలే సినిమా విడుదల సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు.

పుణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన 43 ఏళ్ల తరువాత షోలే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. షోలే సినిమా క్లైమాక్స్‌ ను దర్శకుడు మరో రకంగా చిత్రీకరించాలని భావించాడట. అయితే సెన్సార్‌ సభ్యులు ఠాకూర్, గబ్బర్‌సింగ్‌ను కాళ్లతో తన్ని చంపటంపై, వయలెన్స్ ఎక్కువగా ఉండటంపై అభ్యంతరాలు తెలపటంతో తాను అనుకున్నది తెరకెక్కించకుండా కొద్ది పాటి మార్పులు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. 

ఆ మార్పులు చేయటం తనకు ఇష్టం లేకపోయినా.. సెన్సార్ సభ్యుల సూచనల మేరకు చేయక తప్పలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదన్న విమర్శలను సైతం రమేష్ సిప్పి ఖండించారు. రాజ్‌కుమార్ హిరానీ లాంటి దర్శకులు మంచి కథా కథనాలతో సినిమాలు రూపొందిస్తున్నారని, యువ దర్శకులు మంచి ఆలోచనలతో కొత్త సాంకేతికతతో సినిమాలు రూపొందిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు