Naga Chaitanya: రష్మిక మందన్న ఫేక్‌ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ చైతన్య

7 Nov, 2023 10:35 IST|Sakshi

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో పెద్ద చర్చకు దారితీసింది. రష్మికదిగా చెబుతున్న ఓ అభ్యంతకరమైన వీడియో క్లిప్‌ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ అయిన నిమిషాల్లోనే వైరల్‌ అయింది. నిజానికి అందులో ఉన్నది బ్రిటీష్‌-ఇండియన్‌ సోషల్‌ మీడియా పర్సనాలిటీ జారా పటేల్‌. కానీ కొందరు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్‌ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.

(ఇదీ చదవండి: ఆ ఫోటోలు ఎందుకు షేర్‌ చేస్తానంటే: అనన్య నాగళ్ల)

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వ్యాఖ్యానించారు. తన ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని తెలిపారు.కొందరు దుండగులు రష్మిక ముఖాన్ని మరో యువతి వీడియోగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై చాలా మంది మండిపడుతున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గాయని చిన్మయి శ్రీపాదతో పాటు తాజాగా టాలీవుడ్‌ నుంచి మొదటగా హీరో నాగ చైతన్య రియాక్ట్‌ అయ్యారు. ఈ దుశ్చర్యపై చైతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి' అంటూ అంతకుముందు రష్మిక చేసిన   ట్వీట్‌కు ఆయన ట్యాగ్‌ చేశారు.

తనకు మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల వల్ల సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బందలకు గురౌతున్నారు. ఇది చాలా భయానకమైన చర్య అంటూ తెలిపిన రష్మిక.. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

మరిన్ని వార్తలు