అసలు  ఆట  అప్పుడే!

8 May, 2019 00:57 IST|Sakshi

మొన్నామధ్య వరుణ్‌ తేజ్‌ కాలిఫోర్నియా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. విదేశీ మాజీ బాక్సర్‌ టోనీ డేవిడ్‌ జెఫ్రీస్‌ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్‌. మరి.. బాక్సింగ్‌ బరిలోకి వరుణ్‌ ఎంట్రీ ఎప్పుడు అంటే ఆగస్టులో  అట. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తాను చేయనున్న బాక్సర్‌ రోల్‌ కోసం వరుణ్‌ తేజ్‌ శిక్షణ తీసుకున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్‌ ప్రారంభించి హైదారాబాద్, వైజాగ్, ఢిల్లీలో మేజర్‌ షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్మీకి’ సినిమాలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు