స్క్రీన్‌ టెస్ట్‌

9 Jan, 2018 00:06 IST|Sakshi

► ఎన్టీఆర్‌–జయప్రద ఫేమస్‌ సాంగ్‌ ‘ఓలమ్మి తిక్క రేగిందా..’ పాటను  ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఆ పాటలోని ‘మేల్‌ వాయిస్‌’ ఎవరిదో  తెలుసా?
ఎ) యం.యం. కీరవాణి    బి) ఎస్‌.ఎస్‌.రాజమౌళి    సి) జూ. యన్టీఆర్‌   డి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం

► ‘డాడీస్‌ లిల్‌ గాళ్‌’ అనే టాటూ ఏ ప్రముఖ బాలీవుడ్‌ నటి చేతిపై ఉంటుంది?
ఎ) ప్రియాంకా చోప్రా   బి) దీపికా పదుకోన్‌    సి) విద్యాబాలన్‌    డి) కరీనాకపూర్‌

► సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా? ఈ డైలాగ్‌ను రాసిన రచయిత ఎవరో తెలుసా?
ఎ) జనార్థన మహర్షి    బి) సాయిమాధవ్‌ బుర్రా    సి) క్రిష్‌    డి) పరుచూరి బ్రదర్స్‌

► నాకు ఓల్డ్‌ స్టైల్‌ రొమాన్సే (1990ల్లో) ఇష్టం అని చెప్పే హీరోయిన్‌ ఎవరు? ఈ హీరోయిన్‌ తండ్రి కూడా పెద్ద హీరోనే. తండ్రి తనకు రొమాంటిక్‌ స్టోరీలు చెప్పేవారని ఆమే చెప్పారు.
ఎ) శ్రుతీహాసన్‌   బి) కీర్తీ సురేష్‌    సి) కార్తీక   డి) వరలక్ష్మీ

► మరియప్పన్‌ అనే క్రీడాకారుని జీవితం ఆధారంగా ఓ చిత్రం (బయోపిక్‌) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తానని  ప్రకటించారు. మరియప్పన్‌ ఏ క్రీడకు చెందినవాడు?
ఎ) క్రికెట్‌   బి) బాక్సింగ్‌    సి) లాంగ్‌ జంప్‌   డి) హై జంప్‌

► ప్రభాస్‌ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న  భామ ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రద్ధా కపూర్‌  బి) కంగనా రనౌత్‌    సి) ఇలియానా   డి) రకుల్‌ ప్రీత్‌

► ‘దేవదాసు’ చిత్రానికి మొదట అనుకొన్న హీరోయిన్‌ సావిత్రి కాదు. మరి ఎవరై ఉంటారో  కనుక్కోండి?
ఎ) భానుమతి    బి) యస్‌. వరలక్ష్మి   సి) అంజలీదేవి    డి) ‘షావుకారు’ జానకి

► ‘శంకరాభరణం’ చిత్రంలో మంజు భార్గవి కొడుకు పాత్రలో నటించింది ఓ అమ్మాయి. తర్వాత కాలంలో ఆమె నటిగా చాలా పాత్రలు పోషించారు. ఆమె పేరేంటి?
ఎ) శ్రీలక్ష్మీ    బి) తులసి     సి) ప్రగతి    డి) రజిత

► యలవర్తి నాయుడమ్మ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త. ఆయన మనవరాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ నటుడెవరు?
ఎ) నాని  బి) రామ్‌చరణ్‌    సి) కల్యాణ్‌రామ్‌    డి) ఆది

► ‘మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు’ అనేది ‘మహానుభావుడు’ సినిమాలో డైలాగ్‌. సినిమాలో ఈ డైలాగ్‌ను ఏ కమెడియన్‌ చెప్తాడు?
ఎ) భద్రం  బి) ‘వేన్నెల’ కిశోర్‌    సి) టిల్లు వేణు   డి) రఘుబాబు

► ‘దాన వీర శూర కర్ణ’ సినిమా దర్శకుడెవరు?
ఎ) కమలాకర కామేశ్వరరావు    బి) కె.వి. రెడ్డి    సి) విఠలాచార్య   డి) ఎన్టీ రామారావు

► ప్రభాస్‌ తన మొదటి చిత్రం ‘ఈశ్వర్‌’తో మొదలుకొని ‘బాహుబలి’ రెండు పార్టులతో కలిపి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) 18  బి) 21 సి) 14 డి) 25

► ‘ఆకలేస్తే అన్నం పెడతా మూడొస్తే ముద్దుల్‌ పెడతా చిన్నోడా..’ అనే పాటను పాడింది ఎవరు?
ఎ) శ్రేయా ఘోషల్‌    బి) గీతా మాధురి    సి) మమతా మోహన్‌దాస్‌    డి) దామిని

► యస్‌.యస్‌. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్‌ 10న. అదే రోజు పుట్టిన టాప్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) రాశీఖన్నా   బి) కాజల్‌ అగర్వాల్‌    సి) శ్రియ   డి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌

► కమల్‌హాసన్‌ నటించిన ‘దశావతారం’ సినిమా దర్శకుడెవరు?
ఎ) కె.యస్‌. రవికుమార్‌    బి) పి.వాసు    సి) సురేశ్‌కృష్ణ   డి) లింగుస్వామి

► ‘అబ్బ దబ్బ జబ్బ..’ అనే డైలాగ్‌ చాలా పాపులర్‌. ఈ డైలాగ్‌లో నటించిన లేడీ కమెడియన్‌ శ్రీలక్ష్మీ. ఆమెకు జోడీగా నటించిందెవరు?
ఎ) ఏవీయస్‌   బి) బ్రహ్మానందం    సి) ధర్మవరపు   డి) సుధాకర్‌

► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్‌ అవార్డు లభించింది.ఆ సినిమా పేరేంటి?
ఎ) ౖఖñ దీ నం 150   బి) గౌతమిపుత్ర శాతకర్ణి    సి) బాహుబలి    డి) శతమానం భవతి

► నటుడు వెంకటేశ్‌ ఎవరి సిద్ధాంతాలను నమ్ముతారో తెలుసా?
ఎ) స్వామి వివేకానంద   బి) రమణ మహర్షి   సి) రామకృష్ణ పరమహంస   డి) స్వామి పరిపూర్ణానంద

► 19. ఈ ఫొటోలోని లక్ష్మణుని పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుపట్టండి ?
ఎ) కాంతారావు    బి) హరనాథ్‌బాబు   సి) శోభన్‌బాబు    డి) చలం

► ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టండి?
ఎ) నిత్యామీనన్‌    బి) అనుష్క    సి) భావన    డి) కాజల్‌ అగర్వాల్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి  2) ఎ 3) బి  4) ఎ 5) డి 6) ఎ 7) డి 8) బి 9) ఎ 10) బి 11) డి 12) ఎ  13) సి 14) డి 15) ఎ  16) బి 17) బి 18) బి  19) ఎ 20) ఎ

మరిన్ని వార్తలు