వివేక్‌పై అభిమానుల ఆగ్రహం

26 Sep, 2019 07:57 IST|Sakshi

చెన్నై,పెరంబూరు: సీనియర్‌ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే విజయ్‌ నటించిన బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే నాయకులు తీవ్రంగా ఖండించడంతో పాటు, నటుడు విజయ్‌పై ఎదురు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే వేదికపై నటుడు వివేక్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ని ఇరుకున పడేశాయి. 1980లో శివాజీగణేశ్, వైజయంతిమాల జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్‌ కుడియిరుక్కుం అనే పాటను అపహాస్యం చేసే విధంగా వివేక్‌ చేసిన వ్యాఖ్యలకు శివాజీగణేశన్‌ సమూగ నల పేర్వై సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై ఆ సమాఖ్య అధ్యక్షుడు చంద్రశేఖరన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కొందరు వేదికనెక్కే ఛాన్స్‌ రాగానే అక్కడ చేరిన ప్రజలను చూసి ఏదేదో మాట్లాడతారన్నారు. అందుకు నటుడు వివేక్‌ అతీతం కాదన్నారు. ఆయన బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై దివంగత మహానటుడు శివాజీగణేశన్‌ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్‌ కుడిఇరుక్కుం అనే పాటను పరిహాసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏ నటుడినైనా పొగుడుకోవచ్చని, ఏ సంగీత దర్శకుడినైనా ప్రశంసించుకోవచ్చని, అయితే ఒకరి ప్రాపకం కోసమే ఎంతో ప్రజాదరణ పొందిన పాటను పరిహసించడం వివేక్‌కు తగదని అన్నారు. నటుడు వివేక్‌ ఇంతకు ముందు కూడా పరాశక్తి చిత్రంలో శివాజీగణేశన్‌ న్యాయస్థానంలో చెప్పే సంభాషణలను ఎగతాళి చేసే విధంగా మాట్లాడారని అన్నారు. ఇక ముందు కూడా వివేక్‌ ఇలానే ప్రవర్తిస్తే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

వివేక్‌ వివరణ: కాగా శివాజీగణేశన్‌ అభిమానుల ఆగ్రహానికి స్పందింవిన నటుడు వివేక్‌ 1980లో శివాజీగణేశన్‌ నటించిన ఇరుంబుతిరై చిత్రంలోని నెంజిల్‌ కుడియిరుక్కుం అనే పాటలో ప్రేమ భావం కలుగుతుందనీ, నటుడు విజయ్‌ చెప్పిన దానిలో మంత్రశక్తిలా అనిపిస్తోందని తాను చెప్పానరి, అభిమానులు, మనసు కలిగిన వారు అర్థం చేసుకోవాలని నటుడు వివేక్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

అమితానందం

కల్తీ మాఫియాపై పోరాటం

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్‌!

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

వేణు మాధవ్‌ కోలుకుంటారనుకున్నా : పవన్‌

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నవ్వు చిన్నబోయింది

హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూత

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు