శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

26 Sep, 2019 07:56 IST|Sakshi

2,02,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

సాక్షి ,శ్రీశైలం:  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికితోడు సెల్ఫ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల నుంచి 2,02,899 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం నుంచి విద్యుత్‌ ఉత్పాదన అనంతరం రెండు పవర్‌ హౌస్‌ల ద్వారా 78,289 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

అలాగే బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 12,000 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి పోత్తిపోతల పథకానికి 1,848 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలాశయ పరిసర ప్రాంతాలలో 5.80 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కుడిగట్టు కేంద్రంలో 12.971 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 19.721 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. డ్యాంలో 210.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది.   

చదవండి : పేపర్‌ లీక్‌.. చౌకబారు కుట్రే

మరిన్ని వార్తలు