ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా: బన్నీ

10 Apr, 2015 14:41 IST|Sakshi
ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా: బన్నీ

పుట్టినరోజున ఎంతో ఇష్టంగా ట్విట్టర్ ఖాతాను తెరిచిన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. ఇప్పుడిప్పుడే దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నాడట. తెరిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరో ఒకరి సాయం తీసుకుని ట్వీట్లు చేస్తున్నానని, ఇక ఇప్పుడు మాత్రం తనంతట తానే ట్వీట్లు ఇస్తున్నానని చెప్పాడు.

అయితే అందులో ఏవేం బటన్లు ఉన్నాయో, ఏ రకమైన ఆప్షన్లు ఉన్నాయో తెలుసుకుంటున్నానని అన్నాడు. అంటే, ఇక మీదట నేరుగా బన్నీయే ట్వీట్లు చేస్తాడు, సమాధానాలు ఇవ్వడం, ఫొటోలు, సినిమా సంగతులు అన్నీ స్వయంగా షేర్ చేస్తాడన్న మాట.