'మంగళవారం'లో చాలా బోల్డ్ విషయం ఉంది.. దానికి ధైర్యం కావాలి: అల్లు అర్జున్

11 Nov, 2023 23:41 IST|Sakshi

RX100తో సూపర్‌ హిట్‌ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ చిత్ర నటి పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ ‘మంగళవారం’. ఈ చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం జరిగింది. ఇక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ..

పాయల్ నటించిన RX100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్‌స్టోన్‌ అవుతుంది. అజయ్ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ విషయం ఉంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.నాకు ఈ సినిమా టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. 

నాకు అజయ్ డైరెక్షన్‌లో వచ్చిన RX100 సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్. గొప్ప డైరెక్టర్ అనే నమ్మకం ఉంది. నేను ఈ టీజర్‌ను సుకుమార్ గారికి చూపించాను. ఆయన టీజర్‌ చూసి షాక్‌ అయ్యారు. చాలా బాగా చేశాడు డైరెక్టర్‌ అన్నారు.

లైఫ్‌లో మనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే మన సక్సెస్‌ని వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్‌లు అలాంటి వాళ్లే. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. వాళ్లు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం వచ్చి సపోర్ట్‌ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు