అది అస్సలు నచ్చేది కాదు: హీరోయిన్‌

6 Mar, 2020 11:11 IST|Sakshi

కరీనా కపూర్‌ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా హాజరైంది. ఈ సందర్భంగా తన తండ్రి రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఇబ్బందులను పేర్కొంది. తన వెంట సెక్యురిటీ గార్డులు రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ‘నా తండ్రి శతృఘ్న సిన్హ మంత్రైన తర్వాత ఒక్కసారిగా నా చుట్టూ వాతావారణం మారిపోయింది. నేను స్కూలుకు వెళ్తే నా వెనకాలే కొంతమంది రక్షణగా వచ్చేవారు. అది నాకు విచిత్రంగా తోచేది. అప్పుడు నేను ఆరో, ఏడో తరగతి చదువుతున్నాననుకుంటా. సరిగ్గా ఆ సమయంలోనే నాన్నకు మంత్రి పదవి దక్కింది. ఇంకేముంది, గన్‌మెన్‌లు మేం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. (ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!)

నేను బడికి వెళ్లే జీపు నిండా సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్‌ ఉండేవి. ఇలా వెళ్లడం నాకు అస్సలు నచ్చేది కాదు. నేను స్కూల్లో జీపులో నుంచి దిగుతుంటే అందరూ వింతగా చూసేవారు. ఇలా కాదింక అని, వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అమ్మతో నా గోడు వెల్లబోసుకున్నా. సెక్యూరిటీ గార్డులను నాతో పంపించకపోతేనే స్కూలుకు వెళ్తా.. లేదంటే మానేస్తానని బెదిరించా. ఆ కల నిజమైనప్పుడే నాకు నిజమైన స్వాతంత్య్రం అని భావించాను. ఆ తర్వాతి కాలంలో నేను ఇంటికి దూరంగా ఉన్న కాలేజీ ఎంచుకున్నాను. దీంతో నా చుట్టూ ఏ సెక్యూరిటీ గార్డు లేకుండానే ఎంచక్కా రైలులో వెళ్లేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. కాగా ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘దబాంగ్‌ 3’ వసూళ్లు కురిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం  ఆమె ‘భుజ్‌: ది ప్రైడ్‌ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో నటిస్తోంది.(నమ్మలేకపోతున్నా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు