ఇప్పటికీ ట్రోల్‌ చేయడం బాధగా ఉంది: సోనాక్షి

7 May, 2020 16:21 IST|Sakshi

ముంబై: గతంలో చేసిన తప్పుకు ఇప్పటికీ విమర్శించడం తనని తీవ్రంగా బాధిస్తోందని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా  కరోడ్‌ పతి’ కార్యక్రమానికి సోనాక్షి అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు రామయణానికి సంబంధించిన ప్రశ్న అడగడంతో దానికి ఆమె సమాధానం చెప్పలేకపోయారు. దీంతో మన సంస్కృతిని తెలిపే రామయణం గురి‍ంచి తెలియకపోవడం సిగ్గుచేటు అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’)

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు  శ్రీ శ్రీ రవిశంకర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ‘నేను కౌన్‌ బనేగా కరోడ్‌ పతిలో రూపాదేవి అనే కంటెస్టెంట్‌తో కలిసి హాట్‌‌ సీట్‌లో పాల్గొన్నాను. అప్పుడు నన్ను రామయణంలో ఆంజనేయుడు ఎవరికి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు అని అడిగిన ప్రశ్నకు ఆ క్షణం నా మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. రూమా కూడా సమాధానం చెప్పలేక పోయింది. నిజం చెప్పాలంటే దానికి సమాధానం చెప్పలేకపోయినందుకు ఇబ్బందిగా అనిపించింది. అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామయణం చదువుతూ, వింటూ పెరిగినా కూడా సమాధానం చెప్పలేకపోవడం బాధకరం. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ దీనిపై నన్ను ట్రోల్‌ చేయడం నిజంగా బాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు.  (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్)

ఇక లాక్‌డౌన్ నేపథ్యలో గతంలోని‌ రామయణం సీరియల్‌‌ పునఃప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సోనాక్షి విమర్శలకు గురయ్యారు. దీనిపై సోనాక్షి మాట్లాడుతూ.. రామయణం అర్ధం చేసుకోవడంలో తనని విమర్శించిన వారంతా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎందుకంటే రామయణంలో రాముడు తల్లిదండ్రులకు మంచి కుమారుడు, మంచి భర్త, మంచి మానవుడు ఎలా ఉండాలో అందరికి ఆయన ఓ ఉదాహరణగా ఉంటాడు. ఇక రాముడి నుంచి మంచి నేర్చుకోకుండా వీరంతా నాపై విమర్శలు చేశారని అన్నారు. ఇకపై తాను ఈ విమర్శలను పటించుకోనని ఆమె స్పష్టం చేశారు. (‘ఈ జంట కటిఫ్‌ చెప్పేసుకున్నట్టేనా?!’)

మరిన్ని వార్తలు