‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ అంటున్న ‘రాములమ్మ’

10 May, 2020 17:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాంకర్‌ శ్రీ‌ముఖి అంటే తెలియ‌ని బుల్లితెర ప్రేక్ష‌కుడు ఉండ‌రు. అందంతో పాటు అభినయం కూడా కనబరిచే ఈ భామ ‘బుల్లితెర రాములమ్మ’గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బిగ్ బాస్ 3కి వెళ్లొచ్చిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ డబుల్ అయిపోయింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా మ్యాజిక్ చేయాలని చూస్తుంది శ్రీముఖి. మే 10న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటించిన 'ఇట్స్ టైమ్ టు పార్టీ' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ పోస్టర్‌లో చేతిలో తుపాకీ పట్టి గ్లామర్ లుక్‌లో దర్శనమిచ్చింది శ్రీముఖి.
(చదవండి : వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్‌)

ఈ సినిమాతో గౌతమ్ ఈవీఎస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఫస్ట్ లుక్ సందర్భంగా సందర్భంగా దర్శక నిర్మాత గౌతమ్ ఈవీఎస్‌ మాట్లాడుతూ ‘ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత సమాజంలో యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. సినిమాలో శ్రీముఖి  ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. కానీ, ఆమెది చాలా ముఖ్యమైన పాత్ర. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పాత్ర సర్ ప్రైజ్ ఇస్తుంది. పాత్రలో శ్రీముఖి అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా