తల్లిని తలచుకుంటూ సుశాంత్‌ భావోద్వేగపు లేఖ

18 Jun, 2020 16:55 IST|Sakshi

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఈ నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్‌ తన తల్లిని గుర్తు చేసుకుంటూ స్వహస్తాలతో రాసిన ఓ లేఖ అభిమానుల హృదయాలను కలచి వేస్తోంది. తల్లిని గుర్తు చేసుకుంటూ సుశాంత్‌ అందమైన కవితను రాశాడు. ‘నేను ఉన్నంత కాలం.. మీ జ్ఞాపకాలతోనే నేను సజీవంగా ఉన్నాను. ఓ నీడ వలే. కాలం ఎన్నటికి కదలదు. ఇది ఎంతో అందంగా ఉంది. ఇది ఎప్పటికి ఇలానే కొనసాగుతుంది. అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.(సామాజిక దూరంతోనే ఆత్మహత్యలు!)

సుశాంత్‌కు తన తల్లితో గాఢమైన అనుబంధం ఉండేది. అయితే దురదృష్టవశాత్తు సుశాంత్‌ యుక్త వయసులోనే ఆమె మరణించారు. అయినప్పటికి సుశాంత్‌ ఆమెను తన హృదయంలో పదిలంగా దాచుకున్నారు. ఇదే కాక సుశాంత్‌ చివరి సోషల్‌ మీడియా మెసేజ్‌ కూడా తల్లిని ఉద్దేశిస్తూనే చేశాడు. (కరణ్‌ నంబర్‌ ఇచ్చాడు కదా అని ఫోన్‌ చేస్తే..)

మరిన్ని వార్తలు