600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

21 May, 2019 00:58 IST|Sakshi
ఈశ్వర్‌ ఎల్లు మహంతి, సూర్య, లక్ష్మీ

ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్‌.ఎస్‌.ఎన్‌. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల  31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కు 10 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

ఈ సందర్భంగా ఎం.ఎస్‌.ఎన్‌. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్‌తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్‌ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్‌లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువే అయింది. అవుట్‌ పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్‌ ఈశ్వర్‌ ఎల్లు మహంతి, ఫైట్‌మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌.
 

మరిన్ని వార్తలు