ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

21 May, 2019 00:58 IST|Sakshi
తరుణ్‌ భాస్కర్, సురేశ్‌బాబు, విశ్వక్‌ సేన్, కరాటే రాజు, మనోజ్‌కుమార్‌

– డి.సురేశ్‌బాబు

‘‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రంలో సంభాషణలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్‌ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్‌ చిత్రంగా బాగా తీశారు. సంగీతం కూడా బాగుంది. ఇలాంటి చిత్రం తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్‌ ఎంతో ఇష్టంతో నటించి, దర్శకత్వం వహించారు. తరుణ్‌ భాస్కర్‌ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’. సలోని మిశ్రా కథానాయిక. కరాటే రాజు సమర్పణలో కరాటే రాజు, చర్లపల్లి సందీప్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరో–దర్శకుడు విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. వారంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. మా చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘విశ్వక్‌ మీద మొదట్లో నమ్మకం లేదు. అయితే తను ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చూపించడంతో నమ్మకం కలిగి ఈ సినిమాలో ఓ పాత్ర చేశా’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. ‘‘హైదరాబాద్‌ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని కరాటే రాజు అన్నారు. ‘‘ఈ సినిమాలోని రా కంటెంట్‌ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’’ అని సలోని మిశ్రా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మీడియా 9 మనోజ్‌కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం