‘అవును ప్రేమలో ఉన్నా.. కానీ అతను!’

21 Feb, 2020 20:58 IST|Sakshi

సహజీవనం, పెళ్లికి ముందే పిల్లలను కనడంపై బాలీవుడ్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను స్పందించారు. తాప్పీ తాజాగా నటిస్తున్న ‘థప్పడ్‌’  ఈనెల 28న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాప్సీని ఓ ఇంటర్వ్యూలో సహజీవనంపై తన అభిప్రాయాన్ని అడగ్గా.. ‘పిల్లల అంటే పెళ్లి తర్వాతే పుట్టాలంటారు. అలా కాకుండా పెళ్లికి ముందే పుడితే సమాజం ఒప్పకోకపోగా.. వారిని వెలివేసినట్లుగా చూస్తుంది. ప్రస్తుతం సమాజంలో యువత సహజీవనం అంటే సాధారణ విషయంగా చూస్తోంది. పెళ్లి తర్వాత భార్యభర్తలు చేసే పనులను పెళ్లికి ముందే సహజీవనం పేరుతో చేసేస్తున్నారు. ఇక పిల్లలను కూడా కనెస్తున్నారు. ఇక ఈ  విషయం సరైనదా కదా అనేది పక్కన పెడితే.. ఎవరు ఎలా జీవించాలన్నది వారి వ్యక్తిగత విషయం. ఇతరులు కలగజేసుకోవడానికి వీలులేదు. దీనిపై ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది’  అంటూ సమాధానం ఇచ్చారు. ఇక తానైతే పెళ్లి తర్వాతే పిల్లలను కంటానని..  పెళ్లి తర్వాతే పిల్లలను కంటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బిగ్‌బాస్‌ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

మొదట తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచమైన తాప్సీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మర్చేశారు. అక్కడ కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ హీరోయిన్‌గా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో తాను ఒక్కరిగా ఉన్నారు. అలా సినిమాలతో బిజీ బిజీగా ఉండే ఈ భామ.. ఆ మధ్య ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది కానీ.. తన బాయ్‌ఫ్రెండ్‌ ఎవరనేది మాత్రం చెప్పెలేదు. దీంతో అతను ఎవరో తెలియక ఆమె అభిమానులంతా సతమవుతున్నారు. ఈ సందర్బంగా తన బాయ్‌ ప్రెండ్‌ గురించి చెబుతూ.. ‘నేను ప్రేమలో ఉన్నట్లు ఇది వరకే చెప్పాను. అయితే తను మాత్రం కచ్చితంగా సెలబ్రిటీ కాదు. సెలబ్రిటీ లైఫ్‌కు చాలా దూరంగా.. కామన్‌ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఇక తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను.. పిల్లలను ఎప్పుడు కంటాననేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం’ అంటూ తన బాయ్‌ ఫ్రెండ్‌ సెలబ్రిటీ కాదని ఓ క్లారిటీ ఇచ్చేశారు. 

కోడళ్లకు ఎంత మంది ఇలా చెప్పి ఉంటారు!

మరిన్ని వార్తలు