ఒక్క సినిమా చూడండి.. ఐదు సినిమాలొస్తాయి

25 Nov, 2019 04:03 IST|Sakshi
తాప్సీ

‘బద్లా, గేమ్‌ ఓవర్, మిషన్‌ మంగళ్, సాంద్‌ కీ ఆంఖ్‌’.. ఈ ఏడాది హిందీలో విడుదలైన ఈ నాలుగు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ తాప్సీ నటించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలు సాధించాయి. దీంతో హిందీ పరిశ్రమలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలంటే దర్శక–నిర్మాతలు తాప్సీ పేరును ఓసారి పరిశీలించే స్థాయికి ఎదిగారామె. తాప్సీయే కాదు విద్యాబాలన్, దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఆలియా భట్‌ వంటి అగ్ర కథానాయికలు కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే విషయం గురించి గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (ఇంటర్‌నేషనల్‌  ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకల్లో ‘ఉమెన్‌ ఇన్‌ లీడ్‌’ అనే అంశంపై తాప్సీ మాట్లాడుతూ – ‘‘మీరు ఒక మంచి ప్రేక్షకుడిగా ఉండాలనుకుంటే థియేటర్స్‌కు వెళ్లి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ చూడండి. ఒక్క సినిమా అయినా బాక్సాఫీస్‌ వద్ద విజయం సా«ధిస్తే ఐదు ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ సెట్స్‌పైకి వెళతాయి. ఇది కథానాయికలకు ఎంతో మేలు చేస్తుంది. కొత్తగా రావాలనుకునే హీరోయిన్స్‌లో కూడా ఆత్మవిశ్వాసం నింపినవారవుతారు’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!

కరోనా: హీరో విజయ్‌ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ

సినిమా

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!

కరోనా: హీరో విజయ్‌ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ

ఈసారైనా నెగెటివ్ వ‌స్తే బాగుండు: సింగ‌ర్‌