తమన్నా ఆహా

25 Jun, 2020 06:23 IST|Sakshi

తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్‌లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్‌ స్టార్ట్‌ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్‌ టాక్‌ షోను ప్లాన్‌ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు