మీటూపై షార్ట్‌ ఫిల్మ్‌

28 Feb, 2019 05:28 IST|Sakshi
తనుశ్రీ దత్తా

ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్‌ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్‌ ఫిల్మ్‌ రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్‌ ప్లాన్‌ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్‌ఫిల్మ్‌ కథను తయారు చేశారట. ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించడమే కాకుండా రైటింగ్‌ సైడ్‌ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా