చిన్న గ్యాప్‌ తరువాత మళ్లీ..

30 Oct, 2018 11:07 IST|Sakshi
నటి తాన్యా రవిచంద్రన్‌

సినిమా: సినీరంగంలో హిట్‌తో పాటు లక్కు అవసరం. అలా సక్సెస్‌ను చూసినా నటి తాన్యా రవిచంద్రన్‌కు చిన్న గ్యాప్‌ వచ్చింది. ఇది తనే తీసుకున్న విరామమో, లేక సరైన అవకాశాలు రాకో తెలియదు గానీ మూడు చిత్రాలు చేసిన తరువాత సినిమాలకు కాస్త దూరం అయ్యిందీ బ్యూటీ. ఇంతకీ తాన్యా ఎవరో తెలిసే ఉంటుంది. దివంగత సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ మనవరాలు. నట కుటుంబం నుంచి వచ్చిన ఈ బామ వెల్లయదేవా చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తరువాత బృందావనం, కరుప్పన్‌ చిత్రాలలో నటించింది. వీటిలో విజయ్‌సేతుపతికి జంటగా నటించిన కరుప్పన్‌ చిత్రం సక్సెస్‌ అయ్యింది. ఆ తరువాత మరో చిత్రం చేయలేదు.

తాజాగా సిబిరాజ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. మాయాన్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎన్‌.కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని, సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహణను అందిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్‌ ప్రొడక్షన్స్, మూ మెంట్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర వర్గాలు గత ఆగస్ట్‌ 27వ తేదీనే విడుదల చేశారు. ఈ చిత్రంతోనైనా నటి తాన్యాకు బ్రైట్‌ ఫ్యూచర్‌ కలుగుతుందేమో చూద్దాం. కాగా నిర్మాణ దశలో ఉన్న మాయాన్‌ చిత్రం విడుదల హక్కులను డబుల్‌ మీనింగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పొందింది. ఈ సంస్థ ఇప్పటికే మిష్కిన్‌ దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్‌ హీరోగా నటిస్తున్న సైకో చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేశారన్నది గమనార్హం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు