శ్రీకాంత్‌ నా లక్కీ హీరో

19 Nov, 2018 02:52 IST|Sakshi
సంగీత, శ్రీకాంత్, జిషాన్‌ ఉస్మాన్, జాకీర్‌ ఉస్మాన్, హరిష్‌ వడ్‌త్యా

సంగీత

‘‘నాది ఖమ్మం. 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. సొంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. డి.ఎస్‌.రావుగారి సహకారంతో సాగర్‌గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. అదే నాకు ఈ రోజు బాగా ఉపయోగపడింది’’ అని డైరెక్టర్‌ హరీష్‌ వడ్‌త్యా అన్నారు. శ్రీకాంత్, జిషాన్‌ ఉస్మాన్, సంగీత ముఖ్య తారలుగా హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. మ్యాక్‌ ల్యాబ్స్‌ పతాకంపై మొహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించారు. నందన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను శ్రీకాంత్, మొహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ విడుదల చేశారు. హరీష్‌ వడ్‌త్యా మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నాకెవరూ గాడ్‌ఫాదర్‌ లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డాను.

నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతగారే నా దేవుడు. మరో సినిమా కూడా నాతో చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు మొహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌. ‘‘మై లక్కీ హీరో శ్రీకాంత్‌. మేమిద్దరం ఐదు చిత్రాల్లో నటించాం. ఈ చిత్రం నా సెకండ్‌ ఇన్నింగ్స్‌’’ అన్నారు సంగీత. ‘‘ఎక్కడా ఏ పొరపాటు రాకుండా ఒళ్లు దగ్గర పెట్టుకుని చాలా చక్కగా చేసిన చిత్రమిది’’ అని శ్రీకాంత్‌ అన్నారు. జిషాన్‌ ఉస్మాన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నందన్, దర్శకుడు సాగర్, నటులు బ్రహ్మానందం, అలీ, అజయ్, వెంకట్, దర్శకుడు రవికుమార్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పక్కా లోకలైపోదాం!

డబుల్‌ ధమాకా

'మంచు'వారి సాయం

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

సినిమా

పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్