ఆదాయంలో అమితాబ్‌,షారుక్‌, బన్నీలకంటే టాప్‌!

12 Dec, 2023 09:00 IST|Sakshi

నటి, సింగర్‌, టిక్ టాక్ స్టార్‌, యాంకర్‌ అయిన 'జన్నత్ జుబేర్ రహ్మానీ' పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ పేరు తెలియని వారుండరు.. కేవలం ఏడేళ్ల వయసులో మొదట బుల్లితెరపై కనిపించిన జన్నత్ జుబేర్ రహ్మానీ కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ... 2011లో కలర్స్ టీవీలో  'ఫుల్వా'తో బుల్లి తెరపై మెరిసింది. అప్పటి నుంచి పలు సీరియళ్లతో పాటు లైవ్‌ ప్రోగ్రామ్స్‌, రియాలిటీ షోస్, సాంగ్ ఆల్బమ్స్‌లో తనదైన మార్క్ చూపించి నెట్టింట ఒక ఊపు ఊపేసింది.

2018లో బాలీవుడ్‌లో  అడుగుపెట్టి 'హిచ్కీ' సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. రాణీ ముఖర్జీ స్టూడెంట్స్‌లో ఒకరిగా నటించి ఆపై.. నటిగా కొనసాగుతూనే సింగర్‌గా, వాయిస్ ఆర్టిస్ట్‌గా, టిక్ టాక్ స్టార్‌గా ఇలా ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో అన్నింటిలో తన సత్తా ఎంటో చూపింది ఈ ముంబై బ్యూటీ. ఇండియాలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‎లను కూడా తన క్రేజ్‌తో వెనక్కి నెట్టేసింది. అంతలా బాలీవుడ్‌లో తన ప్రభావం చూపింది. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న ఈ బ్యూటీకి కేవలం ఇన్‎స్టాలో పోస్టులు ద్వారానే దాదాపు రూ.25 కోట్లకు పైగానే సంపాదిస్తోంది. ముంబైలో విలాసవంతమైన ఇల్లు, సుమారు రూ. 3కోట్ల లగ్జరీ కారుతో పాటు తన చుట్టూ ఎప్పుడు సేవకులు.. ఇలా బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. 

బాలీవుడ్‌ నుంచి పంజాబి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడ తన గాత్రంతో విపరీతంగా ఆటకట్టుకుంది. మరో వైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తూ అక్కడా దుమ్మురేపుతుంది. ఆమె టాలెంట్‌ అంతే అనుకుంటే పొరపాటే..  'తు ఆషికి, ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్‌ బాస్‌' వంటి రియాలిటీ  షో నుంచి  పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అలా తన అందం, అభినయంతో అభిమానులను కట్టిపడేసింది. పాన్‌ ఇండియా రేంజ్‌ హీరోలను కూడా వెనక్కినెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్‌ ఫిగర్‌గా మారిపోయింది.

అక్కడ ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల 48 మిలియన్లు. దీంతో ఆమె చేస్తున్న పోస్ట్‌ల ద్వారా ఏడాదికి రూ. 25 కోట్లు అర్జిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌ ఖాన్‌ ఫాలోవర్ల సంఖ్య 42 మిలియన్లు కాగా, అమితాబ్‌కు 38 మిలియన్లు ఉన్నారు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న 41 మిలియన్లు, అల్లు అర్జున్‌ 24 మిలియన్లు, జాన్వీ కపూర్ 22 మిలియన్లు మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి ఈ బ్యూటీ టాలెంట్‌ ఏంటో ఈ పాటికే అర్థమైంది కాదా..!  సోషల్ మీడియాలో ఇంతలా క్రేజ్‌ తెచ్చుకున్న  జన్నత్.. మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్‌, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కేటగిరీల్లో ఫోర్బ్ 30 జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది.

A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29)

>
మరిన్ని వార్తలు