ఎమ్మెస్ నారాయణ ప్రధానపాత్రలో ‘గజదొంగ’.

11 Jul, 2013 03:40 IST|Sakshi
ఎమ్మెస్ నారాయణ ప్రధానపాత్రలో ‘గజదొంగ’.
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘గజదొంగ’. శ్రీనివాస్ దర్శకుడు. యు.శ్రీనివాస్‌రావు, సుంకేసుల రాజాబాబు నిర్మాతలు. సందీప్ స్వరసారథ్యంలో ఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందే చిత్రమిది. 
 
ఇందులో ఎమ్మెస్ కామెడీ పతాకస్థాయిలో ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునే సినిమా. ఇటీవలే ఎమ్మెస్ నారాయణపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దాంతో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెలాఖరున రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. చైతన్య ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు’’ అని తెలిపారు.