వాస్తవ కథ ఆధారంగా..

7 Apr, 2019 01:56 IST|Sakshi
లావణ్య

‘ఉండిపోరాదే.. గుండె నీదేలే.. హత్తుకోరాదే.. గుండెకే నన్నే...’ అనే పాట తెలుగు రాష్ట్రాల్లోని యూత్‌ గుండెలకు ప్రేమగా హత్తుకుంది. ఆ పాటలోని మొదటి పదం ‘ఉండిపోరాదే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తరుణ్‌ తేజ్, లావణ్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సత్యప్రమీల కర్లపూడి సమర్పణలో డా.లింగేశ్వర్‌ నిర్మాతగా నవీన్‌ నాయిని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉండిపోరాదే’.  కేదార్‌ శంకర్, అజయ్‌ ఘోష్, సత్యకృష్ణన్‌ ప్రధాన పాత్రలు చేస్తున్నారు.

‘‘15 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. మనసుని హత్తుకొనే సన్నివేశాలు, ఊహించని ముగింపుతో కన్నీరు తెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుంది. రాజమండ్రి, మైసూర్, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన 20 శాతం హైదరాబాద్, అండమాన్‌ దీవుల్లో జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది’’ అన్నారు చిత్రబృందం. సాబు వర్గీస్‌ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ నెలలో చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు