అహింసే ఆయుధం!

17 Jun, 2015 23:27 IST|Sakshi
అహింసే ఆయుధం!

తెలంగాణ ఉద్యమ చరిత్రనూ, దాని నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తనిష్క మల్టీ విజన్ పతాకంపై గుజ్జ యుగంధర రావు నిర్మించిన చిత్రం ‘బందూక్’. దేశపతి శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, మిధున్‌రెడ్డి, సెహరా బాను ముఖ్య తారలుగా లక్ష్మణ్ మురారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల పాటలు స్వరపరిచారు.
 
  హైదరాబాద్‌లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో పాల్గొన్న గాయకుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘‘ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి చేసిన  తెలంగాణ పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించారు’’ అన్నారు.
 
 ‘‘ఆయుధంతో చేసే పోరాటం కన్నా, అహింస గొప్పద నే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్. శంకర్, నందిని సిద్ధారెడ్డి, రామ్మోహన్, అమరేందర్ త దితరులు పాల్గొన్నారు.