కోట్లల్లో కొందరు!

14 Sep, 2015 23:42 IST|Sakshi
కోట్లల్లో కొందరు!

తెలుగు సినిమాలో..... ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాలో..... అదీ కమర్షియల్ సినిమాలో హీరోయిన్లకి అంత విలువండదు. కథంతా హీరో చుట్టే తిరుగుతుంటుంది అనేది మనం తరచూ వినే కమెంట్. అంత విలువ లేని పాత్రలు ఈ హీరోయిన్లు ఎందుకు చేస్తారన్న అనుమానం మనకు రాకుండా ఉండదు. అందుకే ఓ చిన్న పరిశోధన చేసి, ఇండస్ట్రీ పొరలను ఎన్నో తవ్వి... కొన్ని విషయాలను గోడలను అడిగి, ఇంకొన్నిటిని గుర్రాలతో చెప్పించుకునిమీదాకా తీసుకొస్తున్నాం. దిమ్మ దిరిగింది. విలువ లేదంటారేంటి?

ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో చూడండి. అంత తీసుకున్నాక కథ ఎవరి చుట్టు తిరిగితేనేమి? మనం బ్యాంకు చుట్టూ తిరిగితే చాలదూ? అని హీరోయిన్లు తప్పకుండా నవ్వుకుంటూ ఉంటారని అనిపించింది. డైరీలో డేట్లు తక్కువ ఉంటే బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అదీ మా పరిశోధనా సారాంశం.
 
సమంత
చెన్నై చందమామ
28 ఏళ్లు
తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఏ మాయ చేసావె’ (2010)
చేస్తున్న సినిమాలు: ‘అ..ఆ..’, ‘బ్రహ్మోత్సవం’, తమిళంలో అరడజను సినిమాలు
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25 - 1.75 కోట్లు
 
రకుల్ ప్రీత్‌సింగ్
ఢిల్లీ పిల్లతెమ్మెర
24 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘కెరటం’ (2011)
ఫస్ట్ బ్రేక్: ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013)
చేస్తున్న సినిమాలు: రామ్‌చరణ్‌తో ‘బ్రూస్‌లీ’, బన్నీతో, ఎన్టీఆర్‌తో సినిమాలు, హిందీలో ‘సిమ్లా మిర్చి’.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. కోటి దాకా
 
నయనతార
మలయాళ మకరందం
30 ఏళ్లు
తెలుగులో ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘చంద్రముఖి’ (2005)
చేస్తున్న సినిమాలు: తమిళంలో 5, మలయాళంలో 1, తెలుగులో 1.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ:రూ. 2.25 కోట్లకు పైగా
 
అనుష్క
కన్నడ స్వీటీ
33 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘సూపర్’ (2005)
ఫస్ట్ బ్రేక్: ‘విక్రమార్కుడు’ (2006)
చేస్తున్న సినిమాలు: ‘రుద్రమ దేవి, సైజ్ జీరో, దోస్త్ (గెస్ట్ రోల్), బాహుబలి-2’
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 2 కోట్ల పై మాటే.  
 
శ్రుతీ హాసన్
తమిళ తంగవు
29 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘అనగనగా ఓ ధీరుడు’ (2011)
ఫస్ట్ బ్రేక్: ‘గబ్బర్‌సింగ్’ (2012)
చేస్తున్న సినిమాలు: విజయ్‌తో ‘పులి’, అజిత్‌తో ఒకటి, సూర్యతో ‘సింగం-3’, హిందీలో 2 సినిమాలు
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1.25-1.5 కోట్లు
 
కాజల్ అగర్వాల్
ముంబై ముద్దుగుమ్మ
30 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘లక్ష్మీ కల్యాణం’ (2007)
ఫస్ట్ బ్రేక్: ‘చందమామ’ (2007)
చేస్తున్న సినిమాలు: పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’; మహేశ్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’; తమిళంలో 3, హిందీలో 1.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1- 1.25 కోట్లు
 
తమన్నా
పంజాబీ మిల్కీబ్యూటీ
25 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘శ్రీ’ (2005)
ఫస్ట్ బ్రేక్: ‘హ్యాపీడేస్’ (2007)
చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, నాగార్జున-కార్తీతో ‘దోస్త్’, ప్రభాస్‌తో ‘బాహుబలి-2’.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 1-1.25 కోట్లు
 
నిత్యామీనన్
మలయాళ మందారం
27 ఏళ్లు
ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అలా మొదలైంది’ (2011)
చేస్తున్న సినిమాలు: ‘రుద్రమదేవి’, తమిళంలో 3 సినిమాలు
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 - 60 లక్షలకు పైగా
 
‘కలర్స్’ స్వాతి
పదహారణాల తెలుగమ్మాయి
28 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘డేంజర్’ (2005)
ఫస్ట్ బ్రేక్: ‘అష్టా చమ్మా’ (2008)
చేస్తున్న సినిమాలు: ‘త్రిపుర’, తమిళంలో 3 సినిమాలు.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 45 లక్షలు
 
రాశీ ఖన్నా
ఢిల్లీ పోరీ
23 ఏళ్లు
ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘ఊహలు గుసగుసలాడె’ (2014)
చేస్తున్న సినిమాలు: రవితేజతో ‘బెంగాల్ టైగర్’, రామ్‌తో ‘శివమ్’, సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 -75 లక్షలు
 
రెజీనా
తమిళ మిలమిల
23 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘ఎస్‌ఎమ్‌ఎస్’ (2012)
ఫస్ట్ బ్రేక్: ‘రొటీన్ లవ్‌స్టోరీ’ (2012)
చేస్తున్న సినిమాలు: సాయిధరమ్‌తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, గోపీచంద్‌తో ఓ సినిమా, సాయిధరమ్ తేజ్‌తో మరో చిత్రం.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.25 - 50 లక్షలు
 
లావణ్యా త్రిపాఠీ
ఉత్తరప్రదేశ్ బ్యూటీ
24 ఏళ్లు
ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘అందాల రాక్షసి’ (2012)
చేస్తున్న సినిమాలు: నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’, అల్లు శిరీష్‌తో ఓ సినిమా, మంచు మనోజ్‌తో ఓ సినిమా
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.35 లక్షలు.
 
త్రిష
తమిళ్ అళగి
32 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘నీ మనసు నాకు తెలుసు’ (2003)
ఫస్ట్ బ్రేక్: ‘వర్షం’ (2004)
చేస్తున్న సినిమాలు: తెలుగులో కమలహాసన్‌తో ‘చీకటి రాజ్యం’, ‘నాయకి’, తమిళంలో 4, మలయాళంలో 1 సినిమా.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: అర కోటి పైనే
 
ఇలియానా
గోవా సుందరి
27 ఏళ్లు
ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేవదాసు’ (2006)
చేస్తున్న సినిమాలు: రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’లో ఐటమ్‌సాంగ్ చేయనున్నట్టు సమాచారం.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: కొత్తగా ఏవీ ఒప్పుకోవట్లేదు. పెళ్ళి చేసుకొనే యోచన.
 
హన్సిక
సింధీ బొద్దుగుమ్మ
24 ఏళ్లు
ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ బ్రేక్: ‘దేశముదురు’ (2007)
చేస్తున్న సినిమాలు: విజయ్‌తో ‘పులి’; మరో 3 తమిళ సినిమాలు.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.75 లక్షల నుంచి ఒక కోటి దాకా.
 
అంజలి
గోదావరి తెలుగందం
29 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘ఫొటో’ (2006)
ఫస్ట్ బ్రేక్: ‘జర్నీ’ (2011) (డబ్బింగ్ )
చేస్తున్న సినిమాలు: బాలకృష్ణతో ‘డిక్టేటర్’, లేటెస్ట్ ‘శంకరాభరణం’, ‘చిత్రాంగద’, తమిళంలో 5 సినిమాలు
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ.50 లక్షల దాకా.
 
శ్రీయ
ఢిల్లీ మోడల్
33 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘ఇష్టం’ (2001)
ఫస్ట్ బ్రేక్: ‘సంతోషం’ (2002)
చేస్తున్న సినిమాలు: ప్రస్తుతం తెలుగులో ఏవీ ఒప్పుకోలేదు.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 50 లక్షల దాకా.
 
తాప్సీ
ఢిల్లీ గ్లామర్ గాళ్
28 ఏళ్లు
ఫస్ట్ మూవీ: ‘ఝుమ్మంది నాదం’ (2010)
ఫస్ట్ బ్రేక్: ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ (2011)
చేస్తున్న సినిమాలు: తమిళంలో 1, హిందీలో 2 సినిమాలు, తెలుగులో ఏమీ చేయడం లేదు.
ఇప్పుడు మార్కెట్ గిరాకీ: రూ. 30 లక్షల దాకా