నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

19 Dec, 2019 10:24 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉండే నటుడు అక్షయ్‌కుమార్‌. 52 ఏళ్ల వయస్సులోనే ఫిట్‌గా ఉంటూ.. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ.. నిత్యం సినిమాలు చేస్తూ.. తన సినిమాలను ప్రమోట్‌ చేసుకుంటూ.. క్షణం తీరిక లేకుండా అక్షయ్‌ గడుపుతారు. బాలీవుడ్‌ ఖిలాడీ, సెల్ఫ్‌ మేడ్‌ సూపర్‌స్టార్‌గా పేరొందిన అక్షయ్‌ వ్యక్తిగత జీవితంలో ఎంతో నిబద్ధతతో ఉంటారు. పిల్లలను ప్రేమగా చూసుకునే తండ్రిగా, మంచి భర్తగా అతనికి పేరుంది. 

ఈ క్రమంలో అజెండా ఆజ్‌తక్‌ 2019 సదస్సులో సబ్‌సే బడా ఖిలాడీ సెషన్‌లో అక్షయ్‌ మాట్లాడారు. తన సినిమాలు, సెన్సార్‌ నిబంధనలు, ప్రధాని మోదీతో చేసిన ఇంటర్వ్యూ, లేడీస్‌ మ్యాన్‌గా తనకున్న పేరు ఇలా చాలా అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. 

తన భార్య ట్వింకిల్‌ ఖన్నాతో  అనుబంధం గురించి చెప్తూ.. ‘ట్వింకిల్‌ తరహాలో నాకు రాయడం రాదు. తను చాలా బాగా రాస్తుంది. కానీ ఆమె రాసింది నేను చదవను’ అంటూ సరదాగా పేర్కొన్నారు. తమ ఆలోచనావిధానాలు వేరుగా ఉన్నా తమ మధ్య చక్కని సమన్వయం ఉందని తెలిపారు. మొదట ఓ మ్యాగజీన్‌ షూటింగ్‌లో అక్షయ్‌-ట్వింకిల్‌ కలిసి పనిచేశారు. మొదటిసారి చూడగానే ట్వింకిల్‌తో అక్షయ్‌ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్‌ ఖిలాడీ సినిమా చేశారు. ఈ సినిమాతో వీరి ప్రేమ చిగురించి.. మొగ్గులు తొడిగి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. స్టార్‌ కిడ్‌, స్టార్‌ వైఫ్‌గా పేరొందిన ట్వింకిల్‌ అందమైన నటిగానే కాదు.. మంచి రచయితగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా