'రివాల్వర్ రాణి'కి ఉషా ఉత్తుప్ పాట

2 Apr, 2014 14:05 IST|Sakshi
'రివాల్వర్ రాణి'కి ఉషా ఉత్తుప్ పాట

విభిన్నమైన స్వరం.. నుదుట రూపాయి కాసంత బొట్టు, ఎప్పుడూ నవ్వుతూ గలగల మాట్లాడే ఉషా ఉత్తుప్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ సహా 24 భాషల్లో అలవోకగా లెక్కలేనన్ని పాటలు పాడిన ఆమె ఇప్పటికీ తన గొంతుకు విశ్రాంతి ఇవ్వట్లేదు. కంగనా రనౌత్ ఓ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్న 'రివాల్వర్ రాణి' చిత్రానికి టైటిల్ సాంగ్ పాడారు. కంగనా రనౌత్కు ఉషా ఉత్తుప్ తన గొంతు ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి.

ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ ఉషాజీయే పాడారని, మంచి హస్కీ వాయిస్ కావాలనుకున్న తమకు ఉషా ఉత్తుప్ కంటే మంచి గాయని ఎవరూ దొరకలేదని ఈ సినిమాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం క్వీన్ చిత్రం విజయవంతం కావడంతో మంచి ఊపుమీదున్న కంగనా.. రివాల్వర్ రాణితో మరింత దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది.