వకీల్‌ సాబ్‌: మగువ గొప్పతనంపై ఓ పాట

8 Mar, 2020 13:11 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్‌ ‘పింక్‌’ సినిమాకు ఇది రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన లాయర్‌ పాత్రను ఇక్కడ పవన్‌ చేయనున్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలిసాంగ్‌ రిలీజైంది. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా’ అంటూ తొలి రెండు లైన్లలోనే స్త్రీ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. మెలోడీగా సాగిపోతున్న ఈ పాటలో ప్రతి లైనులో మహిళ ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేశారు. (నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు)

ఆమె గొప్పతనాన్ని, ఓర్పు, సహనాలను కీర్తించారు. సింగర్‌ సిధ్‌ శ్రీరామ్‌ గాత్రంతో ఈ సాంగ్‌ మరింత మధురంగా మారింది. ఈ పాటకు థమన్‌ సంగీతమందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించాడు. పవన్‌కు ఇది 26వ సినిమా కాగా చాలా విరామం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. (కిర్రాక్‌గా పవన్‌ 'వకీల్‌ సాబ్‌' ఫస్ట్‌ లుక్‌)

మరిన్ని వార్తలు