అభిమానులకు వరలక్ష్మీ సలహా!

1 Jun, 2019 10:58 IST|Sakshi

ఎవరూ ఫైట్స్‌ చేయకండి అంటున్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఈ సంచలన నటి చేతిలో ఇప్పుడు 8 చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చేజింగ్‌. ఇందులో వరలక్ష్మీ విలన్లను, రౌడీలను తరిమి తరిమి కొడుతుందట. వీరకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల మలేషియాలో కొన్ని యాక్షన్, థ్రిల్లర్‌ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సన్నివేశాల్లో నటి వరలక్ష్మి ఎలాంటి డూప్, తాడు సాయం లేకుండా, గ్రాఫిక్స్‌ వాడకుండా చాలా రిస్క్‌ తీసుకుని పోరాట సన్నివేశాల్లో నటించినట్లు స్వయంగా చేశారు. వాటిలో కొన్ని ఫైట్‌ సన్నివేశాలను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వరలక్ష్మీ అలా చేయడానికి ప్రయత్నించొద్దన్నారు. ఎందుకంటే అవి చాలా రిస్క్‌తో కూడుకున్నవని, అందులో నటించడానికి తాను ముందుగా రిహార్సల్స్‌ చేశానని, స్టంట్‌మాస్టర్‌ శిక్షణలో పలు జాగ్రత్తలు తీసుకుని నటించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు