‘నీకు ఆ అర్హత లేదు.. ఆమెను వదిలేయ్‌’

9 Jul, 2020 17:52 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో పలవురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాకు దూరమయిన సంగతి తెలిసిందే. మరి కొందరు తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ కామెంట్‌ సెక్షన్‌నికి లిమిట్‌ సెట్‌ చేసుకున్నారు. వీరిలో సుశాంత్‌ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే బాయ్‌ఫ్రెండ్‌ విక్కీ జైన్‌ కూడా ఉన్నారు. సుశాంత్‌ మరణించిన నాటి నుంచి పలువురు అభిమానులు విక్కీ జైన్‌ను విమర్శిస్తూ కామెంట్‌ చేస్తున్నారట. ‘నీకు అంకిత కావాల్సి వచ్చిందా.. ఆమెను వదిలేయ్’‌ అంటూ నెటిజనులు విక్కిని ట్రోల్‌ చేస్తున్నారట. దాంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కామెంట్‌ సెక్షన్‌కి లిమిట్‌ సెట్‌ చేశాడు విక్కిజైన్‌. సుశాంత్‌ మరణించిన నాటి నుంచి అంకిత కూడా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నారు.(‘సుశాంత్ కోసం త‌న జీవితాన్నే ఇచ్చేసింది’)

2009లో వచ్చిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో అంకిత, సుశాంత్‌ కలిసి నటించారు. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. సినిమాల్లో అవకాశం వచ్చిన తర్వాత సుశాంత్‌, అంకితకు దూరమయ్యాడని సమాచారం. ఆ తర్వాత అంకిత కూడా సినిమాల్లో నటించారు. మణికర్ణిక సినిమాలో అంకిత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆమె బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త విక్కి జైన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారు. వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ క్రమంలో ఒక సారి ఇంటర్వ్యూలో అంకిత విక్కి జైన్‌ గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి వ్యక్తి. అతను బిలాస్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం మేం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి గురించి వెల్లడిస్తాం’ అని తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా