విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

1 Oct, 2019 07:50 IST|Sakshi

సినిమా: దళపతి విజయ్‌ కథా నాయకుడు, మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడు అయితే ఆ చిత్రం ఎలా ఉంటుంది. మజాగుం టుంది కదా! అయినా అది జరిగే పనేనా అని అనుకుంటున్నారా? జరగబోతోందండీ. విజయ్‌ హీరోగా నటిం చనున్న తాజా చిత్రంలో విజయ్‌సేతుపతి విలన్‌గా నటించనున్నారు. అవును ఇది అధికార వార్తే. నటుడు విజయ్‌ ప్రస్తుతం బిగిల్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆయనకు జంటగా నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. దీపావళి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో విజయ్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ కియారాఅద్వాని హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎక్స్‌బీ ఫిలింస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవీర్‌ బ్రింటో నిర్మించనున్నారు. ఇది విజయ్‌ 64వ చిత్రం. దీనికి సంబంధించిన ఫ్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. అక్టోబరు తొలివారం నుంచి ఈ సంచలన చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు విజయ్‌సేతుపతి విలన్‌గా నటించనున్న విషయాన్ని సోమవారం చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇందు కోసం ఆయనకు పారితోషికం భారీగానే ముట్ట జెబుతున్నట్లు వినికిడి. విజయ్‌సేతుపతి కోలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పాత్రలో వైవిధ్యం ఉంటే అది ఎలాంటిదైనా చేయడానికి సిద్ధం అంటున్నారు. అలా పేట చిత్రంలో రజనీకాంత్‌ను ఢీకొనే పాత్రలోనే నటించారు. ఇక సైరా నరసింహారెడ్డి చిత్రంలో విలక్షణ పాత్రలో కనిపించనున్నారు. అదే విధంగా ఇప్పుడు విజయ్‌కు విలన్‌గా మారడానికి రెడీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు