నాకూ... ఆ రొమాన్సే ఇష్టం!

4 Jan, 2017 01:10 IST|Sakshi
నాకూ... ఆ రొమాన్సే ఇష్టం!

సినిమాలు... సంగీతం... జీవితం... ఎక్కడ చూసినా శ్రుతీహాసన్‌ మోడ్రన్‌ అమ్మాయిలకు రోల్‌ మోడల్‌ అన్నట్టు కనిపిస్తారు. కానీ, ఆమెకు మోడ్రన్‌ డేస్‌ రొమాన్స్‌ కంటే ఓల్డ్‌ స్టైల్ రొమాన్సే ఇష్టమట! ‘‘మా రోజుల్లో వాట్సాప్, ఇతరత్రా మొబైల్‌ యాప్స్‌ లేవు. అందువల్ల, అందరూ నేరుగా కలుసుకుని మాట్లాడుకునేవారు.

మీటింగులు, మాటల వల్లే సగం ప్రేమకథలు చిగురించేవి’’ అని కమల్‌హాసన్‌ శ్రుతీతో చెప్పేవారట!! శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘ల్యాండ్‌లైన్‌కి బాయ్‌ఫ్రెండ్‌ ఎవరైనా కాల్‌ చేస్తే ఎక్కడ అమ్మ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తారోనని కంగారు... నోకియా ఫోనులు, ఇంట్లో తెలియకుండా మెస్సేజ్‌లు పంపుకోవడాలు.. ఎంతైనా ఆ రోజులే వేరు. నాన్న చెప్పిన ప్రేమకథలు నాకింకా గుర్తున్నాయి. ఇప్పటి యువతరమంతా అటువంటి రొమాంటిక్‌ మూమెంట్స్‌ని మిస్‌ కావడం బాధాకరం. నాకు ఓల్డ్‌  స్టైల్  సింపుల్‌ రొమాన్స్‌ అంటేనే ఇష్టం’’ అన్నారు.