సందేశంతో హెచ్చరిక

19 Nov, 2023 03:41 IST|Sakshi
అజయ్‌ ఘోష్,అఖిల్‌ సన్నీ

అఖిల్‌ సన్నీ, అజయ్‌ ఘోష్, సంజయ్‌ నాయర్, గిడ్డేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్‌ నిర్మిస్తున్నారు.

‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్‌ హంగులు మేళవించి ఈ సినిమా  తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్‌ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు