బాహుబలి యూనిట్‌కు వైఎస్ జగన్ అభినందనలు

28 Mar, 2016 12:27 IST|Sakshi
బాహుబలి యూనిట్‌కు వైఎస్ జగన్ అభినందనలు

జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రం అవార్డుతో పాటు ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులకు కూడా అవార్డు గెలుచుకున్న బాహుబలి చిత్రయూనిట్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇలాంటి అరుదైన పురస్కారాన్ని పొందడం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణం, గౌరవం అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగేలా మరిన్ని నాణ్యమైన సినిమాలను తెలుగు సినీ పరిశ్రమ నిర్మిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాహుబలి చిత్ర దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.