26 కిలోల బంగారం పట్టివేత

1 Dec, 2017 17:29 IST|Sakshi

ఇంపాల్‌ : భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని భారత సరిహద్దు ప్రాంతంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి మొత్తం 26కిలోల బరువున్న 158 బంగారు కడ్డీలను వ్యానులో తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తిని మణిపుర్‌లోని తోబుల్‌ జిల్లాలో లిలాంగ్‌ కలేకాంగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ డక్రుద్దిన్గా గుర్తించారు. కుదెంగ్‌తాబిలోని పోలీస్‌ చెక్‌ పోస్ట్‌లు, అసోం రైఫిల్స్‌ పోస్ట్‌లను దాటి వెళుతున్న వ్యానును ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు లోక్‌చావో నది సమీపంలో పట్టుకుని మహ్మద్ డక్రుద్దిన్‌ను అరెస్ట్‌ చేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరిన్ని వార్తలు