ఈ పోలీస్‌ ‘మామూలోడు’ కాదు!

29 Aug, 2019 04:14 IST|Sakshi

కాబోయే భార్య నుంచి లంచం తీసుకున్నట్లు యూనిఫాంలో వీడియో

జైపూర్‌: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందుకే ఓ పోలీస్‌ అధికారి తన ప్రీ వెడ్డింగ్‌ను అంతే వినూత్నంగా ప్లాన్‌ చేసుకున్నారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. పోలీస్‌ యూనిఫామ్‌లోనే షూటింగ్‌ చేయడంపై కేసు నమోదైంది. రాజస్తాన్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) ధన్‌పత్‌ సింగ్‌ వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ను మూడు నెలల కిందట జరిపారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌ అయింది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వెళ్తుండగా ఆ ఎస్సై ఆమెను ఆపుతాడు. హెల్మెట్‌ పెట్టుకోనందుకు ఫైన్‌ కట్టమంటాడు.

దీంతో అతని చొక్కా జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. ఇదంతా ఎస్సై పోలీస్‌ యూనిఫాంలోనే షూట్‌ చేయడంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనిఫాంలో ఉండి లంచం తీసుకోవడం దాన్ని ప్రోత్సహించేలా ఉందని మందలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైందని, దర్యాప్తు చేస్తామని ఐజీ హవా సింగ్‌ గుమారియా తెలిపారు. దీనిపై ఎస్సై ధన్‌పత్‌ స్పందిస్తూ.. ‘ఈ వీడియో కావాలని తీసింది కాదు. నేను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పాను. కానీ తాను మొత్తం వీడియోను అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు’అని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

75 కొత్త సర్కారు మెడికల్‌ కాలేజీలు

‘ఆమె’కు అందని అంతరిక్షం!

సలహాదారులుగా చుట్టాలొద్దు

థర్డ్‌ డిగ్రీలకు కాలం చెల్లింది

50వేల ఉద్యోగాలు

చంద్రుడికి మరింత చేరువగా

గత15 రోజుల్లో 10 మంది పాకిస్తాన్‌ కమాండోలు హతం

ఈనాటి ముఖ్యాంశాలు

కూతురు ఫోన్‌లో అశ్లీల వీడియో.. తండ్రిపై లైంగిక కేసు

‘తీవ్రవాదులే ఎక్కువ వాడుతున్నారు’

కేబినెట్‌ కీలక నిర్ణయాలు : ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు

ఇదేం ప్రజాస్వామ్యం..

టైమ్స్‌ టాప్‌ 100లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’

పాపం రాహుల్‌ ఇలా బుక్కవుతున్నాడేంటి!?

టైలర్‌ కొడుకు, నా కొడుకు ఒకేసారి ఐఐటీలోకి: సీఎం

లావుగా ఉన్నానని బయటకు పంపడం లేదు

కశ్మీర్‌పై ఐదుగురు మంత్రులతో జీఓఎం

భద్రతతోనే ఆర్థికాభివృద్ధి : అమిత్‌ షా

చంద్రునికి మరింత చేరువగా

పీవీ సింధూపై ట్వీట్‌ వైరల్‌...

కశ్మీర్‌ భారత్‌ అంతర్గత అంశం: రాహుల్‌

ఉగ్రవాదమే పాక్‌ ఆయుధం..

కశ్మీర్‌లో ఆంక్షలు : కేంద్రానికి సుప్రీం నోటీసులు

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

కశ్మీర్‌ లోయలో నేటి నుంచి హైస్కూళ్లు

వారణాసిలో ఉగ్రదాడికి లష్కరే స్కెచ్‌

‘ఆ పోలీసుల సత్తా తెలుసు.. జాగ్రత్తగా ఉంటాను’

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌..

పక్కా ప్లాన్‌తో; భయానక స్థితిలో మృతదేహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆసియాలో అతి పెద్ద స్క్రీన్‌

నలుగురు దర్శకులు.. నెట్‌ఫ్లిక్స్‌ కథలు

శర్వా ఎక్స్‌ప్రెస్‌

ఆనందం.. విరాళం

పల్లెల్ని ఎవరు పట్టించుకుంటారు?

గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు