జూన్ 1 నుంచి 'అటల్ పింఛన్ యోజన'

6 Mar, 2015 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పింఛన్‌దారుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన పథకాన్ని జూన్ 1 నుంచి ప్రారంభించనుంది. గత యూపీఏ హయాంలో స్వావలంభన్ యోజనగా ఉన్న ఈ పథకం పేరును ఎన్‌డీఏ ప్రభుత్వం అటల్ యోజనగా మార్చింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కార్మికులు దీనికి అర్హులని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అథియా తెలిపారు. 60 ఏళ్లు దాటిన తరువాత నెలకు రూ.1000 నుంచి 5000 వరకు పింఛన్ లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతీ కార్మికుడు పింఛన్‌కు చెల్లించే సంవత్సర మొత్తంలో సగం లేదా రూ.1000 ఏదీ తక్కువైతే అది ప్రభుత్వం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు