భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్!

21 Sep, 2016 02:04 IST|Sakshi

భువనేశ్వర్: కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయనుందని  కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. భువనేశ్వర్‌లో కార్మికుల జాతీయ భేటీలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకూ వీటిని కల్పించే ందుకు కసరత్తు జరుగుతోందన్నారు.   రాష్ట్రాలకు నిర్మాణ పన్ను రూపేణా వచ్చిన రూ. 27,886 కోట్లలో రూ.5,800 కోట్లే ఖర్చు పెట్టాయని విమర్శించారు.

భవన నిర్మాణ కార్మికుల చట్టం-1996 ప్రకారం ఆ సొమ్మును కార్మికుల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు.ఈ పన్ను రూపంలో ఒడిశా ప్రభుత్వం వసూలు చేసిన రూ. 940 కోట్లలో రూ. 120 కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఈ సదస్సులో ఒడిశా, బిహార్, తెలంగాణ, మేఘాలయ, జార్ఖండ్, హరియాణాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు